పూర్తయిన పచ్చనోట్ల పంపిణీ

TDP Activists Distributing Money in Chittoor - Sakshi

చిత్తూరు అర్బన్‌: హోరెత్తిన ప్రచారపు మైకులు మూగబోయాయి. ఇక మిగిలింది 24 గంటలు గడవడమే. మరోవైపు ఓటర్లకు పంపిణీ చేసే తాయిలాలను అధికార పార్టీ దిగ్విజయంగా పూర్తి చేసింది. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ నిర్వహించడానికి పోలీసులు అన్ని ముందస్తు చర్యలు పూర్తిచేశారు. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు విక్రాంత్‌పాటిల్, అన్బురాజన్‌ల నేతృత్వంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన 18 బెటాలి యన్లు ఇప్పటికే జిల్లాలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే 38 చోట్ల ఏర్పాటుచేసిన చెక్‌పోస్టుల్లో క్షుణ్ణంగా తనిఖీలు జరుగుతున్నాయి. వీటిల్లో 26 అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాలున్నాయి. సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం, డబ్బును అరికట్టడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

మద్యం బంద్‌..
మరోవైపు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకే మద్యం దుకాణాలు, మద్యం బార్లు మూతపడ్డాయి. 50 గంటల పాటు వీటిని తెరవడానికి వీల్లేదని ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ డెప్యూటీ కమిషనర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. ఈనెల 11 రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసేయాల్సిందే. దుకాణా ల్లో, గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరిగినా, మద్యం పంపకాలు చేపట్టినా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తామని నాగలక్ష్మి హెచ్చరించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు 13.88 లక్షల లీటర్ల మద్యం, లక్ష లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకున్నారు. 1, 053 మంది పాతనేరస్తులను బైండోవర్‌ చేసుకున్నారు. మొత్తం రూ.2.71 కోట్ల విలువ చేసే మద్యం, వాహనాలను ఎక్సైజ్‌ అధికారులు సీజ్‌ చేశారు.

వీరికి ఫిర్యాదు చేయొచ్చు...
స్వారత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు ఎన్నికల పరిశీలకులను నియమించిన విషయం తెలిసిందే. జిల్లాలోని 14 నియోజకవర్గాలతోపాటు రెండు పార్లమెంట్‌ స్థానాలకు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను నియమించింది. ఎక్కడైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే నేరుగా అధికారులను సంప్రదించవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top