రాష్ట్రాన్ని ముక్కలు చేసి, ప్రజల జీవితాలతో చెల బగాటమాడుతున్న కాం గ్రెస్ పార్టీని ప్రజలంతా తరిమికొట్టాలని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం
బూర్జ,న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని ముక్కలు చేసి, ప్రజల జీవితాలతో చెల బగాటమాడుతున్న కాం గ్రెస్ పార్టీని ప్రజలంతా తరిమికొట్టాలని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం పిలుపునిచ్చా రు. పెద్దపేట విత్తనాభివృద్ధి క్షేత్రంలో బుధవారం నిర్వహించిన మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలకు నూకలు చెల్లాయన్నారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. అ ధికార కాంగ్రెస్ పార్టీ పలుమార్లు ప్రజలను మోసం చేస్తోందని దుయ్యబట్టా రు. రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, నందమూరి తారకరామారావులేనని..మళ్లీ ఆ సత్తా..జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు
జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రా మాల్లో ఇంటింటా పర్యటించి..పార్టీ ఔన్నత్యాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతం చేయాలన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పైడి కృష్ణప్రసాద్, కూన మంగమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. బూర్జ నాయకులు ఆనెపు రామకృష్ణ, బెజ్జిపురం రామారావు మాట్లాడుతూ.. 2014 నాటికి కాంగ్రెస్, టీడీపీలు కనిపించకుండా పోతాయన్నారు. పార్టీ నా యకులు టంకాల కూర్మినాయుడు, దాసిరెడ్డి వెంకునాయు డు, గొర్రెల అప్పలనాయుడు, పైడి గోపాలరావు, పప్పల కృష్ణ, లక్కుపురం సర్పంచ్ శాసపు శ్రీనివాసరావు, ఏపీపేట సర్పంచ్ పైల రామమూర్తి, ఉప్పినివలస సర్పంచ్ బాదె నర్శింహమూర్తి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.