యువతి అనుమానాస్పద మృతి : యువకుడు పరార్ | Suspicious death of a young woman | Sakshi
Sakshi News home page

యువతి అనుమానాస్పద మృతి : యువకుడు పరార్

May 19 2015 4:46 PM | Updated on Aug 1 2018 2:31 PM

యువకుడితో వచ్చిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

రాజమండ్రి: యువకుడితో వచ్చిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  అయితే ఆమెతో వచ్చిన యువకుడు మాత్రం పారిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాకలో ఈ ఘటన జరిగింది. యువతీయువకులు ఇద్దరూ కలసి తాటిపాకలోని ఓ హోటల్కు వెళ్లారు. యువతి మృతి చెందింది. ఆ యువకుడు పరార్ అయ్యాడు. దాంతో యువతి మృతి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.  పోస్ట్ మార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని ఆస్సత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి యువకుడి కోసం గాలిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తేగానీ ఆ యువతి ఎలా మృతి చెందిందో తెలియదని పోలీసులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement