తప్పును ఎత్తిచూపకపోతే సమాజం బాగుపడదు | Supreme Court Judge Justice chalamesvar comments | Sakshi
Sakshi News home page

తప్పును ఎత్తిచూపకపోతే సమాజం బాగుపడదు

Mar 18 2017 1:41 AM | Updated on Sep 2 2018 5:28 PM

తప్పును ఎత్తిచూపకపోతే సమాజం బాగుపడదు - Sakshi

తప్పును ఎత్తిచూపకపోతే సమాజం బాగుపడదు

తప్పును తప్పని చెప్పకపోతే రాజ్యాంగ వ్యవస్థకు శ్రేయస్కరం కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌  

అవనిగడ్డ: తప్పును తప్పని చెప్పకపోతే రాజ్యాంగ వ్యవస్థకు శ్రేయస్కరం కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ బార్‌ అసోసియేషన్‌ హాలులో దివంగత న్యాయవాది కంఠంనేని రవీంద్రరావు జ్ఞాపకార్థం ఆయన కుటుంబసభ్యులు ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని జస్టిస్‌ చలమేశ్వర్‌ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

పార్లమెంటులో అడుగు పెట్టాలంటే ఒక ఎంపీ రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్లు ఖర్చుపెడు తున్నారని ఎన్నికల సంఘం మాజీ అధికారి హెచ్‌ఎస్‌ బ్రహ్మ ఇటీవల చెబితే చాలామంది సీరియస్‌గా తీసుకోకపోవడం తనకు బాధ కలిగించిందన్నారు.  అనంతరం జస్టిస్‌ చలమేశ్వర్‌ ను సత్కరించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అందె శ్రీరామకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement