మాతృమూర్తికి మరింత గుర్తింపు | Super Mom more recognition | Sakshi
Sakshi News home page

మాతృమూర్తికి మరింత గుర్తింపు

Jul 3 2014 1:58 AM | Updated on Jul 11 2019 5:01 PM

మాతృమూర్తికి మరింత గుర్తింపు - Sakshi

మాతృమూర్తికి మరింత గుర్తింపు

పిల్లలు సాధించే ప్రతి విజయంలోనూ తల్లిదండ్రుల పాత్రే ప్రధానం. కానీ విజయాలకు సంబంధించిన రికార్డుల్లో మాత్రం నాన్న పేరే కనబడుతుంది. అమ్మకష్టం కనిపించదు.

  • ‘పది’ సర్టిఫికెట్‌లో పేరు
  •  యూజీసీ ఉత్తర్వులు
  •  ఆనందంలో మహిళాలోకం
  • జగ్గయ్యపేట : పిల్లలు సాధించే ప్రతి విజయంలోనూ తల్లిదండ్రుల  పాత్రే ప్రధానం. కానీ విజయాలకు సంబంధించిన రికార్డుల్లో మాత్రం నాన్న పేరే కనబడుతుంది. అమ్మకష్టం కనిపించదు. అందుకే పిల్లలకు సంబంధించిన ప్రతి సర్టిఫికెట్‌లోనూ మాతృమూర్తి పేరునూ చేర్చారు. మాతృమూర్తికీ తగిన గుర్తింపు ఇవ్వాలని మహిళా సంఘాలు గత  ప్రభుత్వానికి విజ్ఞప్తిచేయడంతో సానుకూలంగా స్పందించిన గత కేంద్ర ప్రభుత్వం 2011 నుంచి 10వతరగతి మార్కుల జాబితాలో తండ్రిపేరుతోపాటు తల్లిపేరునూ ప్రచురిస్తున్నారు.

    అయితే ఇప్పటివరకు మార్కుల జాబితాలకే పరిమితమైన తల్లిపేరు ఇక నుంచి అన్ని సర్టిఫికెట్లల్లోనూ తప్పనిసరిగా ప్రచురించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకనుంచి రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, ఇతర అన్నిరకాల గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లలోనూ తల్లుల పేర్లు ప్రచురితం కానున్నాయి.
     
    అమ్మపేరు ఆనందంగా ఉంది..     
    ఇప్పటివరకు సన్ ఆఫ్ అని తండ్రిపేరును మాత్రమే పలికేవాళ్లం. ఇప్పడు అమ్మపేరు ఉండటంతో ఎంతో సంతోషంగా ఉంది. తల్లిని గుర్తించడం పిల్లలుగా మాకు సంతోషాన్ని కలిగిస్తోంది.
     ఆర్. దివ్య, విద్యార్థిని
     
     ఇది శుభపరిణామం..
    తల్లుల పేర్లు మార్కుల జాబితాలో రావడం ఎంతో శుభపరిణామం. మా ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ప్రస్తుతం అన్ని సర్టిఫికెట్లలోనూ తల్లులకు గుర్తింపు ఇవ్వడం సంతోషంగా ఉంది.
     గుత్తికొండ రాణి, విద్యార్థినితల్లి
     
     సంతోషంగా ఉంది. .
     మా మార్కుల జాబి తాలో మా అమ్మపేరు చూసుకుని మురిసిపోయాం. చెప్పలేనంత ఆనందం కలిగించింది. అమ్మకు పేరు చూపించి ఆమె కళ్లల్లో ఆనందాన్ని చూశాం. ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం.
     అమరీందర్, విద్యార్థి
     

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement