గండికి వెళుతూ..బోల్తా పడ్డ సుమో,,ఇద్దరు మృతి | sumo crashes on way to gandi,two peoples died | Sakshi
Sakshi News home page

గండికి వెళుతూ..బోల్తా పడ్డ సుమో,,ఇద్దరు మృతి

Aug 25 2013 5:53 AM | Updated on Sep 1 2017 10:07 PM

పోట్లదుర్తి-ఎర్రగుంట్ల గ్రామాల మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవరు బాబా ఫకృద్ధీన్(50), రామపూజిత(6) మృతి చెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రొద్దుటూరులోని అమృతానగర్, శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన వెంకటరామిరెడ్డి, రామిరెడ్డి కుటుంబసభ్యులు శ్రావణ శనివారం కావడంతో గండిక్షేత్రానికి టాటా సుమోలో బయలుదేరారు.

ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్ : పోట్లదుర్తి-ఎర్రగుంట్ల గ్రామాల మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవరు బాబా ఫకృద్ధీన్(50), రామపూజిత(6) మృతి చెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రొద్దుటూరులోని అమృతానగర్, శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన వెంకటరామిరెడ్డి, రామిరెడ్డి కుటుంబసభ్యులు శ్రావణ శనివారం కావడంతో గండిక్షేత్రానికి టాటా సుమోలో బయలుదేరారు. సుమోలో డ్రైవర్, యాజమాని బాబా ఫకృద్ధీన్ , చిన్నారులు రూప, రామపూజిత, రాజ్యలక్ష్మి, వెంకటకిశోర్‌రెడ్డితో పాటు భాగ్యలక్ష్మి(పూజిత తల్లి), రాజేశ్వరీ, వెంకటరామిరెడ్డి ఉన్నారు. వీరితోపాటు ఎర్రగుంట్లకు పోవడానికి రామాదేవి ప్రొద్దుటూరు బైపాస్‌లో ఎక్కింది. అయితే సుమో పోట్లదుర్తి దాటిన తరువాత వెనుక టైర్ పగిలింది. వేగాన్ని అదుపు చేసుకోకపోవడంతో సుమో రోడ్డుపైనే పల్టీలు కొట్టి బోల్తా పడింది.
 
  ఈ ఘటనలో రామపూజిత అక్కడికక్కడే మృతిచెందగా క్షతగాత్రులను రెండు 108 వాహనాల ద్వారా ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గ మధ్యలో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో భాగ్యలక్ష్మి, వెంకటకిశోర్‌రెడ్డి, రూప, రాజ్యలక్ష్మి, రాజేశ్వరీ, వెంకటరామిరెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. పూజిత మృతి చెందడంతో తల్లి బాగ్యలక్ష్మి బోరున విలపించింది. టెంకాయలు, అన్నం, కూరగాయలు చెల్లాచెదురుగా రోడ్డు పైన పడిపోయాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement