ఎస్ఐ ఆత్మహత్య: పీఎస్ ఎదుట బంధువుల ధర్నా | Sub Inspector suicide at obulavaripalli in ysr kadapa district | Sakshi
Sakshi News home page

ఎస్ఐ ఆత్మహత్య: పీఎస్ ఎదుట బంధువుల ధర్నా

Apr 8 2014 8:44 AM | Updated on Sep 2 2018 5:06 PM

నిన్న సాయంత్రం రివాల్వర్తో ఆత్మహత్య చేసుకున్న ఓబులువారిపల్లె ఎస్.ఐ నంద్యాల సురేష్కుమార్ రెడ్డి అత్మహత్యకు రైల్వే కోడూరు సీఐ రమాకాంత్ వేధింపులే కారణమని అయన బంధువులు ఆరోపించారు.

నిన్న సాయంత్రం రివాల్వర్తో ఆత్మహత్య చేసుకున్న ఓబులువారిపల్లె ఎస్.ఐ నంద్యాల సురేష్కుమార్ రెడ్డి అత్మహత్యకు రైల్వే కోడూరు సీఐ రమాకాంత్ వేధింపులే కారణమని అయన భార్య, బంధువులు ఆరోపించారు. మంగళవారం ఉదయం ఓబులువారిపల్లె పోలీసు స్టేషన్ ఎదుట సురేష్ భార్య, బంధువులు ధర్నా చేశారు. సీఐ రమాకాంత్ వచ్చి వివరణ ఇచ్చేవరకు సురేష్ మృతదేహన్ని అంగుళం కూడా కదిలించమని వారు భీష్మించుకుని కూర్చొన్నారు.

ఉన్నతాధికారులు రమాకాంత్కు కొమ్ముకాస్తున్నారని సురేష్ కుమార్ రెడ్డి భార్య,బంధువులు ఈ సందర్బంగా ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఓబులువారిపల్లె ఎస్.ఐ. నంద్యాల సురేష్ కుమార్ రెడ్డి నిన్న సాయంత్రం పోలీసు క్వార్టర్స్లో రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement