స్కూల్ వ్యాన్ బోల్తా: విద్యార్థులకు గాయాలు | Students injured in school van accident | Sakshi
Sakshi News home page

స్కూల్ వ్యాన్ బోల్తా: విద్యార్థులకు గాయాలు

Apr 8 2015 8:19 AM | Updated on Apr 3 2019 7:53 PM

నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కొత్తపేట సమీపంలో బుధవారం స్కూల్ వ్యాన్ బోల్తా పడింది.

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఓజిలి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో రహదారిపై బుధవారం స్కూల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. కొత్తపేట గ్రామస్తులు వెంటనే స్పందించి గాయపడ్డిన విద్యార్థులకు నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థుల్లో 15 మంది స్వల్పంగా.... మరో ఐదుగురు అధికంగా గాయపడ్డారని తెలిపారు.

నందు అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అధిక వేగంతో వెళ్తున్న బస్సు... రహదారి వాలుగా ఉండటంతో  ఒక్కసారిగా బస్సు పక్కనున్న పొలాల్లోకి దూసుకువెళ్లి... బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement