విద్యార్థులు ఫుల్... గదులు నిల్ | students full but rooms nill | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఫుల్... గదులు నిల్

Feb 16 2014 2:51 AM | Updated on Sep 2 2017 3:44 AM

విద్యార్థులు ఫుల్... గదులు నిల్

విద్యార్థులు ఫుల్... గదులు నిల్

ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని దొండపాడు రస్తాలోని రామాంజనేయపురం కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఫుల్‌గా ఉన్నా

 విద్యార్థులు ఫుల్... గదులు నిల్  
 ఎర్రగుంట్ల, :ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని దొండపాడు రస్తాలోని రామాంజనేయపురం కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఫుల్‌గా ఉన్నా.. గదులు కొరతగ ఉండడంతో గత్యంతరం లేక ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో తడికలతో గుడిసెలు వేసుకొని పాఠాలు బోధిస్తున్న దుస్థితి ఇక్కడ నెలకొంది. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలకు మాత్రం ప్రభుత్వం బిల్డింగ్‌లను మంజూరు చేస్తుందని మా పాఠశాలలో విద్యార్థులు సుమారు 101 మంది ఉన్నా బిల్డింగ్ వసతి కల్పించలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ పాఠశాలో మొదటి తరగతి నుంచి ఐదవ తరగతి వరకు విద్యార్థులు ఉండగా ప్రధానోపాధ్యాయునితో కలిపి ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఉన్న గదులు రెండు శిథిలావస్థకు చేరుకున్నాయని వర్షం వస్తే  తడిసి ముద్ద అవుతుందని వారు వాపోయారు. విద్యార్థులు సంఖ్య చాలా ఎక్కువగ ఉండడంతో గత్యంతరం లేక ఆవరణలోనే తడికలతో ఒక గుడిసెను వేసుకొని విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నామని వారు వాపోయారు. ఇప్పటికైన ప్రజాప్రతినిధులు కానీ, విద్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు కొత్త భవనాలు మంజురు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకరయ్య, ఉపాధ్యాయుడు శివరామిరెడ్డిలు  కోరుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement