ఏసీ కొనలేదని విద్యార్థిని ఆత్మహత్య | student suicides for the air conditioner buying | Sakshi
Sakshi News home page

ఏసీ కొనలేదని విద్యార్థిని ఆత్మహత్య

May 30 2015 7:58 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఏసీ కొనలేదని విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

ఏసీ కొనలేదని విద్యార్థిని ఆత్మహత్య

తన ఇష్టం ప్రకారం ఏసీ కొనలేదని డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.

రాజమండ్రి: తన ఇష్టం ప్రకారం ఏసీ కొనలేదని డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాజమండ్రి పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. జాంపేట మఠం వీధికి చెందిన నందారపు శివజ్యోతి ఓ కళాశాలలో ఇటీవలే బీకాం ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసింది. ఆమె స్నేహితురాలి ఇంట్లో నూతనంగా ఏసీ కొనుగోలు చేశారు.

దాంతో తన ఇంట్లో ఏసీ పెట్టించాలంటూ శివజ్యోతి తల్లిదండ్రులను కోరింది. తల్లిదండ్రులు కొనలేమని చెప్పినా ఆ అమ్మాయి వినలేదు. ఏసీ విషయమై తల్లితో గొడవపడింది. మనస్తాపంతో శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యాన్ హుక్‌కు ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement