ఆప్టిమిస్ట్‌ నుంచి స్మార్ట్‌ ఏసీ | Optimist Smart AC Launches 5 Star Inverter AC India Rs 39,990, Check Out Specifications And Other Details Inside | Sakshi
Sakshi News home page

ఆప్టిమిస్ట్‌ నుంచి స్మార్ట్‌ ఏసీ

May 31 2026 8:00 AM | Updated on May 31 2026 12:45 PM

optimist smart ac launches 5 star inverter ac india rs 39990

హైదరాబాద్‌: దేశీ క్లైమేట్‌–టెక్‌ బ్రాండ్‌ ఆప్టిమిస్ట్‌ ఎయిర్‌ కండీషనింగ్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. 50 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ సమర్ధవంతంగా పని చేసే స్మార్ట్‌ ఏసీలను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్‌ కింద 1.4 టన్నుల 5 స్టార్‌ ఇన్వర్టర్‌ స్ప్లిట్‌ ఏసీలపై ఎంఆర్‌పీ మీద 38 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు, రూ. 39,990కే అందిస్తున్నట్లు సంస్థ  సహ వ్యవస్థాపకులు, సీఈవో ఆశీష్‌ గోయల్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో 1 టన్, 2 టన్‌ వేరియంట్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. తమ ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌తో పాటు ఆన్‌లైన్‌లో అమెజాన్, ఆప్టిమిస్ట్‌ పోర్టల్స్‌లో కూడా ఇవి లభిస్తాయని పేర్కొన్నారు.

ఆప్టిమిస్ట్‌ సంస్థను అర్బన్‌ ల్యాడర్‌ మాజీ సహ వ్యవస్థాపకుడు ఆశీష్‌ గోయల్‌, ప్రణవ్‌ చోప్రా కలిసి 2024లో స్థాపించారు. భారత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఏసీలను అభివృద్ధి చేస్తున్న ఈ స్టార్టప్‌ ఇటీవలే యాక్సెల్‌, అర్కామ్‌ వెంచర్స్‌ తదితర ఇన్వెస్టర్ల నుంచి 12 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. ఐఐటీ ఢిల్లీతో కలిసి థర్మల్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్‌ వాలిడేషన్‌పై పనిచేసిన సంస్థ, విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించే అధిక సామర్థ్య సాంకేతికతతో పాటు స్మార్ట్‌ యాప్‌ ఆధారిత మానిటరింగ్‌, గ్యాస్‌ లెవల్‌ ఇండికేటర్‌ వంటి ఫీచర్లను కూడా అందిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement