Inverter AC sales
-
ఇన్వర్టర్ ఏసీ vs నాన్ ఇన్వర్టర్ ఏసీ
నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి తాపం ఇప్పుడిప్పుడే మొదలవుతుండటంతో ప్రతిఒక్కరూ ఏసీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మార్కెట్లోకి వెళ్లగానే వినియోగదారులకు తలెత్తే ప్రధాన ప్రశ్న.. 'ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా? లేక నాన్-ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా..?' అని. తక్కువ ధరలో వస్తుందని కొందరు, విద్యుత్ ఆదా అవుతుందని మరికొందరు రకరకాలుగా ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య ఉన్న కీలక తేడాలు, లాభనష్టాలపై ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఇన్వర్టర్ ఏసీఇన్వర్టర్ ఏసీ అనేది అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. గది ఉష్ణోగ్రతను బట్టి ఇందులోని కంప్రెసర్ తన వేగాన్ని వాటంతట అదే సర్దుబాటు చేసుకుంటుంది. గది చల్లబడగానే కంప్రెసర్ పూర్తిగా ఆగిపోకుండా నెమ్మదిగా తిరుగుతూ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచు తుంది.నాన్-ఇన్వర్టర్ ఏసీనాన్-ఇన్వర్టర్ ఏసీ అనేది పాత పద్ధతిలో పనిచేస్తుంది. కంప్రెసర్ అయితే పూర్తిగా ఆన్‌లో ఉంటుంది లేదా పూర్తిగా ఆఫ్‌లో ఉంటుంది. గది చల్లబడగానే కంప్రెసర్ ఆగిపోవడం, మళ్లీ వేడి పెరగగానే వెంటనే స్టార్ట్ కావడం దీని ప్రత్యేకత. ఏసీ అనగానే సామాన్యుడికి గుర్తొచ్చేది కరెంట్ బిల్లు. ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ పదే పదే ఆన్, ఆఫ్ కానక్కర్లేదు కాబట్టి విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది జేబుకు ఉపశమనాన్ని ఇస్తుంది.అదే నాన్-ఇన్వర్టర్ ఏసీ విషయానికొస్తే.. కంప్రెసర్ ప్రతిసారీ పూర్తి సామర్థ్యంతో స్టార్ట్ కావాల్సి రావడంతో కరెంట్ బిల్లు భారమయ్యే అవకాశం ఉంది. గదిలో ఒకే రకమైన చల్లదనం ఉండాలని కోరుకునే వారికి ఇన్వర్టర్ ఏసీ సరైన ఎంపిక. ఇది ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు లేకుండా చూస్తుంది. నాన్-ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ ఆగిపోయిన ప్రతిసారీ గదిలో ఉష్ణోగ్రత స్వల్పంగా పెరగడం, మళ్లీ తగ్గడం వంటి మార్పులు గమనించవచ్చు.జీవితకాలం పరంగా రెండూ మెరుగైనవే అయినప్పటికీ, నిర్వహణలో తేడాలున్నాయి. ముఖ్యంగా ఇన్వర్టర్ ఏసీ.. విషయంలో పీసీబీ వంటి సున్నితమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఉంటాయి. ఒకవేళ ఇవి పాడైతే మరమ్మతు ఖర్చు కాస్త ఎక్కువేగానే ఉంటుంది. నాన్-ఇన్వర్టర్ ఏసీ.. దీని టెక్నాలజీ చాలా సరళంగా ఉంటుంది. విడిభాగాలు ఎక్కడైనా సులభంగా దొరుకుతాయి. మెకానిక్ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం ఏసీ వాడాల్సి వస్తే.. కచ్చితంగా ఇన్వర్టర్ ఏసీ వైపు వెళ్లడమే తెలివైన పని అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తక్కువ సమయం, అప్పుడప్పుడు మాత్రమే వాడే వారైతే నాన్-ఇన్వర్టర్ ఏసీని ఎంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు. - పసుపులేటి. వెంకటేశ్వరరావు. -
ఏసీల అమ్మకాలు కూల్..!
2015లో 43 లక్షల ఏసీల విక్రయం అంచనా - 15% వృద్ధి ఖాయం: పరిశ్రమ - కంపెనీలకు సానకూల వాతావరణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్మకాల జోష్‌తో ఎయిర్ కండీషనర్ల(ఏసీ) మార్కెట్ వేడెక్కింది. భానుడి ప్రతాపానికితోడు దేశవ్యాప్తంగా సెంటిమెంటు బలంగా ఉండడంతో ఏసీల విపణి జోరందుకుంది.గతేడాదితో పోలిస్తే 2015లో 15 శాతంపైగా వృద్ధి ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. భారత్‌లో 2014లో రూమ్ ఏసీలు 37.5 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుత సంవత్సరంలో 43 లక్షలకుపైగా యూనిట్లు నమోదవుతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గతేడాది 2.50 లక్షల ఏసీలు విక్రయమయ్యాయి. ఈ ఏడాది 15% వృద్ధి ఉంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. జనవరి, ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా 5.5 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. సహజంగా జనవరి-మార్చి కాలంలో 25 శాతం అమ్మకాలు నమోదవుతాయి. భారత్‌లో వోల్టాస్, ఎల్జీ, శాంసంగ్‌ల తర్వాతి స్థానం కోసం బ్లూ స్టార్, హిటాచీ, ప్యానాసోనిక్ పోటీపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎల్జీ, బ్లూ స్టార్, శాంసంగ్‌లు తొలి 3 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇన్వర్టర్ ఏసీల హవా.. భారత్‌లో ఇన్వర్టర్ ఏసీల అమ్మకాలు ఊపందుకున్నాయి. విద్యుత్‌ను గణనీయంగా ఆదా చేసే ఈ మోడళ్ల వాటా ప్రస్తుతం 8%గా ఉంది. 2015లో ఈ విభాగం 15%కి, 2018 నాటికి 30 శాతానికి ఎగబాకుతుందని బ్లూస్టార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సీపీ ముకుందన్ మీనన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘5 స్టార్‌తో పోలిస్తే ధర 25% అధికం. అయితే విద్యుత్‌ను ఆదా చేసుకోవాలంటే ఇన్వర్టర్ ఏసీ వాడకమొక్కటే మార్గం. ఈ ఏడాది బ్లూస్టార్ నుంచి ఈ విభాగంలో 20-25 కొత్త మోడళ్లు రానున్నాయి’ అని చెప్పారు. ఇన్వర్టర్ ఏసీలు చైనాలో 80%, జపాన్‌లో 50% ఆక్రమించేశాయి. అల్యూమినియంకు బదులు కాపర్ కాయిల్‌తో తయారైన ఏసీలపట్ల కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన వివరించారు. ఏసీల జీవిత కాలం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని తెలిపారు. తెలుగు వెలుగులు.. ఏసీల ఎంపిక విషయంలో తెలుగు కస్టమర్లు ముందుంటున్నారు. విండో ఏసీలను దాదాపుగా మర్చిపోయారు. 2014లో కేవలం 12,500 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. స్ప్లిట్ ఏసీల వాటా అత్యధికంగా 95 శాతం ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం పరిశ్రమలో 5 స్టార్ ఏసీల వాటా 20 శాతమైతే, తెలుగు రాష్ట్రాల్లో ఇది 23%. విక్రయాల్లో తెలుపు రంగు మోడ ళ్లు 1.75 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. తెలుపు తర్వాత ఎరుపు, బంగారు వర్ణానికి డిమాండ్ ఎక్కువ. మొత్తంగా 50% ఏసీ అమ్మకాలు చిన్న పట్టణాల నుంచి నమోదవుతున్నాయి. 2020 నాటికి వార్షిక అమ్మకాలు 1 కోటి యూనిట్లకు చేరుకోవచ్చని బ్లూస్టార్ అంటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయి.


