రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం | Student dies in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

Jun 22 2015 3:34 PM | Updated on Aug 30 2018 3:56 PM

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయినిపల్లె వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.

కొలిమిగుండ్ల : కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయినిపల్లె వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బి.తాడిపత్రి గ్రామానికి చెందిన కిషోర్, నాగరాజులు తిమ్మనాయినిపల్లి హైస్కూల్లో ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకున్నారు. కాగా సోమవారం ఉదయం హైస్కూల్లో టీసీలు తీసుకుని వీరు తాడిపత్రికి బైక్‌పై వెళుతుండగా... వెనుక నుంచి వచ్చిన ఓ లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన నాగరాజును జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement