శ్రీవారి క్షేత్రంలో గుండెపోటుకు గురైన భక్తుడు | srivari kshetram one person is heart attack | Sakshi
Sakshi News home page

శ్రీవారి క్షేత్రంలో గుండెపోటుకు గురైన భక్తుడు

Mar 3 2014 3:15 AM | Updated on Sep 2 2017 4:16 AM

శ్రీవారి క్షేత్రంలో గుండెపోటుకు గురైన భక్తుడు

శ్రీవారి క్షేత్రంలో గుండెపోటుకు గురైన భక్తుడు

ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శిం చుకు వస్తున్న ఓ భక్తుడు ఆదివారం ఉదయం గుండెపోటుకు గురై ఆలయంలోనే కుప్పకూలిపోయాడు.

ద్వారకాతిరుమల
 ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శిం చుకు వస్తున్న ఓ భక్తుడు ఆదివారం ఉదయం గుండెపోటుకు గురై ఆలయంలోనే కుప్పకూలిపోయాడు. అతడిని ఆలయ సిబ్బంది, కొందరు భక్తులు ఆలయ ప్రధానరాజగోపుర ప్రాంతంలోని ప్రథమ చికిత్సా కేంద్రానికి తరలించారు. అక్కడి సిబ్బంది పీహెచ్‌సీకి తీసుకెళ్లాలని సూచించారు.

 

108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కొంత సమయం తరువాత బాదితుడిని ఆటోలో పీహెచ్‌సీకి తరలించారు. ద్వారకాతిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా, వారికి అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయాలు అందించేందుకు సరైన ఆసుపత్రి లేదు. ఇటీవలి కాలంలో ఆలయానికి వచ్చి గుండెపోటుకు గురైన ముగ్గురు భక్తులను ఇదే విధంగా ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతిచెందారు.

]ఆలయం వద్ద కనీసం ఆంబులెన్స్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు చెబుతున్నారు. ఎంతో ఆదాయం ఉన్న దేవస్థానం భక్తులు, స్థానికులు, పరిసర ప్రాంత ప్రజల సౌకర్యార్థం కనీసం వసతులున్న ఆసుపత్రిని నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement