ఆచూకీ తెలిపితే రూ. లక్ష | specify the adress will give one lakh rupes as prize money | Sakshi
Sakshi News home page

ఆచూకీ తెలిపితే రూ. లక్ష

Dec 2 2013 2:44 AM | Updated on Sep 2 2017 1:10 AM

ఓబులవారిపల్లె మండలం జీవీ పురంలో వరుస హత్యలకు పాల్పడుతున్న తోట వెంకట రమణ ఆచూకీ తెలిపితే రూ. లక్ష అందజేస్తామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు.

కడప అర్బన్, న్యూస్‌లైన్ : ఓబులవారిపల్లె మండలం జీవీ పురంలో వరుస హత్యలకు పాల్పడుతున్న  తోట వెంకట రమణ ఆచూకీ తెలిపితే రూ. లక్ష అందజేస్తామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు.
 
 అలాగే బెంగుళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి చేసిన వ్యక్తి ఆచూకీ తెలిపితే  రూ. 2 లక్షల రివార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. నేరాలకు పాల్పడుతున్న వీరి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అరెస్టు చేసిన తర్వాత రివార్డులను అందజేస్తామన్నారు.తమ  నెంబరు 94407 96900 లేదా రాజంపేట డీఎస్పీ, రైల్వేకోడూరు సీఐల ఫోన్ నెంబర్లకు స్వయంగాగానీ, ఫోన్ ద్వారాగానీ సమాచారం ఇవ్వచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement