హైదరాబాద్‌–కాకినాడ మధ్య ప్రత్యేక రైలు | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌–కాకినాడ మధ్య ప్రత్యేక రైలు

Published Thu, Sep 21 2017 3:29 AM

హైదరాబాద్‌–కాకినాడ మధ్య ప్రత్యేక రైలు - Sakshi

లక్ష్మీపురం(గుంటూరు): దసరాకు హైదరాబాద్‌–కాకినాడ పోర్ట్‌ వయా గుంటూరు మీదుగా ప్రత్యేక రైలును నడపాలని నిర్ణ యించినట్లు గుంటూరు రైల్వే డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌–కాకినాడ పోర్ట్‌ ప్రత్యేక రైలు (07001) ఈ నెల 27, 29, అక్టోబర్‌ 1తేదీల్లో నడుస్తుం దని తెలిపారు. 27, 29 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 6.50కి రైలు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.35కి చేరుకుం టుందన్నారు.

అక్టోబర్‌ 1న హైదరాబాద్‌ నుంచి రాత్రి 11.40కి బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 11.45కి కాకినాడ పోర్ట్‌కు చేరుకుంటుందన్నారు. కాకినాడ పోర్ట్‌–హైద రాబాద్‌ ప్రత్యేక రైలు (07002) ఈ నెల 28, అక్టోబర్‌ 2న కాకినాడ పోర్ట్‌ నుంచి సాయంత్రం 5.55కి బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.10కి హైదరాబాద్‌ చేరు కుంటుందని తెలిపారు. ఈ నెల 30న కాకి నాడ పోర్టు నుంచి సాయంత్రం 6.50కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.10కి హైదరాబాద్‌కు చేరుకుంటుందన్నారు.

హైదరాబాద్‌–విశాఖపట్నం–హైదరాబాద్‌ వయా గుంటూరు
హైదరాబాద్‌– విశాఖపట్నం వయా గుంటూ రు మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు ఉమామహేశ్వరరావు తెలిపారు. హైదరా బాద్‌–విశాఖ రైలు (07148) ఈ నెల 28, 30 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి రాత్రి 6.50కి బయల్దేరి మర్నాడు ఉదయం 8కి విశాఖకు చేరుకుంటుందన్నారు. విశాఖ–హైదరా బాద్‌ రైలు (07147) ఈ నెల 29న రాత్రి 7.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందన్నారు.

Advertisement
Advertisement