
నేడు గుంటూరులో హోదా భరోసా సభ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో జరగనున్న ప్రత్యేక హోదా భరోసా సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
ఆదివారం సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులో ఉన్న ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరుగనుంది. రాహుల్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4.30కు విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో గుంటూరులోని ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు.