సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు | Special Busses for Sankranthi Festival | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Dec 21 2013 1:41 AM | Updated on Sep 2 2017 1:48 AM

సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఈడీ రవీందర్ తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఈడీ రవీందర్ తెలిపారు.  వెన్నెల ఏసీ బస్సులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జనవరి 10, 11 తేదీలలో కాకినాడ, నెల్లూరు, విజయవాడకు బయలుదేరతాయి. కాకినాడ బస్సు 10వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు, విజయవాడ బస్సు రాత్రి 11 గంటలకు బయలు దేరుతుంది. నెల్లూరుకు 10, 11 తేదీల్లో సాయంత్రం ఆరు గంటలకు ఒక్కో బస్సు ఉంటుంది. తిరుగు ప్రయాణంలో.. కాకినాడ రైల్వేస్టేషన్ నుంచి 15వ తేదీన, నెల్లూరు, విజయవాడ రైల్వే స్టేషన్‌ల నుంచి 15, 16 తేదీల్లో సాయంత్రం ఆరు గంటలకు ఈ బస్సులు హైదరాబాద్‌కు బయలుదేరుతాయి. డిసెంబర్ 27న రాత్రి 9 గంటలకు ఒక వెన్నెల బస్సు విజయవాడ నుంచి శ్రీకాకుళం బయలుదేరుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement