రేవంత్‌ సర్కార్‌కు షాక్‌.. మెట్రో, ఆర్టీసీ కామన్‌ పాస్‌ ఫెయిల్‌! | Passengers Not Interested On Metro Common Pass In Hyderabad | Sakshi
Sakshi News home page

రేవంత్‌ సర్కార్‌కు షాక్‌.. మెట్రో, ఆర్టీసీ కామన్‌ పాస్‌ ఫెయిల్‌!

Oct 9 2026 8:45 AM | Updated on Oct 9 2026 8:45 AM

Passengers Not Interested On Metro Common Pass In Hyderabad

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో చాలామంది ప్రయాణికులు కామన్‌ పాస్‌ల కొనుగోలుపై విముఖత చూపుతున్నారు. ధరలు ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో, ఆర్టీసీ కామన్‌ పాస్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటిని అందుబాటులోకి తెచ్చి వారమైనా  ఆశించిన స్పందన లేదు. ఇప్పటి వరకు  2 నెలవారీ పాస్‌లు, మరో 34 డైలీ పాస్‌లు అమ్ముడయ్యాయి. రూ.400 ఖరీదైన డైలీ పాస్‌లను కొనుగోలు చేసేందుకు కొంత మేరకు ఆసక్తి ఉన్నప్పటికీ రూ.8,500 మంత్లీపాస్‌పై మాత్రం వ్యతిరేకత కనిపిస్తోంది.

ఆర్టీసీ, మెట్రో మంత్లీ కామన్‌ పాస్‌లో రూ.7,000 మెట్రో వాటా కాగా, రూ.1,500 ఆర్టీసీ వాటాగా నిర్ణయించారు. ఈ పాస్‌పై ప్రయాణికులు నెల రోజుల పాటు ఏసీ, నాన్‌ ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. కానీ మెట్రో వాటా మాత్రమే  అత్యధికంగా ఉండడం గమనార్హం. నాగోల్‌– రాయదుర్గం, ఎల్‌బీనగర్‌-మియాపూర్, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ కారిడార్‌లలో ప్రస్తుతం రోజుకు 4.7 లక్షల మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. చాలా మంది ఉదయం ఇంటి నుంచి బయలుదేరి తిరిగి సాయంత్రం ఇళ్లకు చేరుకొనేందుకు మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. దీంతో సగటు ప్రయాణికుడు 30  రోజుల పాటు ప్రయాణం చేసినా రూ.4,500 కంటే ఎక్కువ ఖర్చు కాదు. దీనికి ఆర్టీసీ వాటా రూ.1,500 చేర్చినా  గరిష్టంగా రూ.6,000 వరకు ఖర్చవుతుంది. కానీ.. దానికి అదనంగా రూ.2,500 పెంచి ఏకంగా రూ.8,500 చొప్పున నిర్ణయించడం గమనార్హం.  

త్వరలో సమీక్ష... 
కాగా.. కామన్‌పాస్‌ ధరలపై అధికారులు పునరాలోచనలో పడ్డారు. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడం, ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ధరలను సమీక్షించే  అవకాశం ఉంది.  

👉‘కామన్‌ పాస్‌ ధర చాలా ఎక్కువ. ఈ ధరలను భరించేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు. వెంటనే ధరలను తగ్గించాలి’ మరికొంతమంది ప్రయాణికులు   ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నగరంలో ప్రవేశపెట్టిన ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్‌పై సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన ప్రయాణికుల స్పందన ఇది.

👉‘నేను ప్రతిరోజూ మెట్టుగూడ నుంచి హైటెక్‌ సిటీకి ప్రయాణం చేస్తాను. రెండువైపులా రాకపోకలు సాగించేందుకు రోజుకు రూ.125 చొప్పున నెలలో 25 రోజులకు రూ.3,125 ఖర్చవుతాయి. మరి రూ.8,500 వెచి్చంచి ఆరీ్టసీ, మెట్రో కామన్‌ పాస్‌ను ఎందుకు కొనుగోలు చేస్తాను’.        – మృత్యుంజయ్‌

👉‘మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌కు రాకపోకలు సాగించేందుకు రూ.138. ఒక నెలంతా అంటే 31 రోజులు  ప్రయాణం చేసినా అయ్యే ఖర్చు రూ.4,278 మాత్రమే. రూ.8,500 ఖర్చు చేసి కామన్‌ పాస్‌ కొనడం ఎందుకు’. 
    – సాయి కిరణ్‌.

ఇదీ చదవండి: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ దిగిపోవాల్సిందే: కేటీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement