కుమారులతో కలసి భార్యను హత్య చేసిన భర్త | Sons and Husband killed by wife at East godavari district | Sakshi
Sakshi News home page

కుమారులతో కలసి భార్యను హత్య చేసిన భర్త

Jul 6 2014 8:12 AM | Updated on Jul 27 2018 2:18 PM

భర్తతో కలసి మంగాదేవి (పాత ఫోటో) - Sakshi

భర్తతో కలసి మంగాదేవి (పాత ఫోటో)

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను ఆస్తి కోసం భర్తతో పాటు ఆమె ఇద్దరు కుమారులు కలసి హత్య చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా తునిలో చోటు చేసుకుంది.

అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను ఆస్తి కోసం భర్తతో పాటు ఆమె ఇద్దరు కుమారులు కలసి హత్య చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా తునిలో చోటు చేసుకుంది. మృతురాలు మంగాదేవి (48) పేరిట భారీగా ఆస్తులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా ఆస్తి తమ పేరిట రాయాలంటూ మంగాదేవిపై ఆమె భర్త, పిల్లలు ఒత్తిడి తెస్తున్నారు. అందుకు ఆమె ససేమీరా అనడంతో గత అర్థరాత్రి మంగాదేవిపై భర్త ఇద్దరు కుమారులు క్రికెట్ బ్యాట్తో దాడి చేశారు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది.

 

దాంతో ఆమెను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మార్గ మధ్యంలోనే మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. మంగదేవి మృతిపై పోలీసులు సమాచారం అందుకుని ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగదేవి భర్త ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement