‘చంద్రబాబు మరో డ్రామాకు సిద్ధమయ్యారు’ | Somu Veerraju fires on Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు మరో డ్రామాకు సిద్ధమయ్యారు’

Feb 5 2019 5:54 PM | Updated on Feb 5 2019 5:56 PM

Somu Veerraju fires on Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ : ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని చంద్రబాబు ఇప్పుడు కొత్త హామీలు
గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ అమలు చేయాలేని చంద్రబాబు మళ్లీ రైతుల కోసం రూ.5000 కోట్లు అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు పసుపు కుంకుమ పేరుతో మరో డ్రామాకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. 

చంద్రబాబు మాటలని ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ఒకవైపు కేంద్రం సహకరించలేదంటారు, మరోవైపు రాష్ట్రం అభివృద్ధి పథంలోనడుస్తుందని చంద్రబాబు చెపుతుంటారని చెప్పారు. కేంద్రం సహకరించకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement