మండలిలో ఆరు కీలక బిల్లుల ఆమోదం | Six Bills Are Approved In AP Legislative Council | Sakshi
Sakshi News home page

మండలిలో ఆరు కీలక బిల్లుల ఆమోదం

Dec 16 2019 7:11 PM | Updated on Dec 16 2019 8:53 PM

Six Bills Are Approved In AP Legislative Council - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులు ఆమోదం పొం‍దాయి. సోమవారం మండలిలో సమావేశాల్లో భాగంగా సభ్యుల సుదీర్ఘ చర్చల అనంతరం.. ఆరు బిల్లులకు ఆమోదం లభించింది. మండలిలో ఆమోదం పొందిన బిల్లులు... ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతిక, వారసత్వపు బోర్డు చట్టం సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం- క్రిమినల్ శాసన చట్టం 2019 బిల్లు, ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం- మహిళలు, బాలికలపై నిర్దేశిత అపరాధముల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానం చట్టం 2019 బిల్లు, ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థల, ఎండోమెంట్ చట్టం సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య క్రమబద్ధీకరణ, పర్యవేక్షణ కమిషన్ చట్టం సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. మొత్తం 11 కీలక బిల్లులు ప్రవేశపెట్టగా సోమవారం ఆరు బిల్లులు ఆమోదం పొందాయి. మిగిలిన వాటిపై మం‍ళవారం సభలో చర్చను చేపట్టనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సమావేశం రేపటి (మంగళవారం)కి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement