సింగపూర్ వెళ్లనున్న చంద్రబాబు బృందం | Singapore delegates meet Chandra Babu Naidu | Sakshi
Sakshi News home page

సింగపూర్ వెళ్లనున్న చంద్రబాబు బృందం

Mar 4 2015 11:15 PM | Updated on Aug 18 2018 6:18 PM

రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం క్షేత్రస్థాయి పర్యటన చేస్తుందని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు.

హైదరాబాద్:  రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం క్షేత్రస్థాయి పర్యటన చేస్తుందని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఈ నెల 30 లోపు ఆ బృందం మాస్టర్ప్లాన్ కాన్సెప్ట్ను సిద్ధం చేస్తుందని తెలిపారు.  బుధవారం సీఎం చంద్రబాబుతో సింగపూర్ బృందం భేటీ అయింది. అనంతరం నారాయణ మాట్లాడుతూ... రాజధాని మాస్టర్ ప్లాన్ను చంద్రబాబుకు సింగపూర్ బృందం వివరించిందని చెప్పారు.

ఈ నెల 30 చంద్రబాబు బృందం సింగపూర్ వెళ్లాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్లో ఇంకా 740 ఎకరాలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉందని నారాయణ స్పష్టం చేశారు. భూ వివాదాలు, యజమానుల నిర్థారణ వంటి సమస్యలున్నాయని ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement