' ఇదంతా ఓర్వలేకే.. బాధ్యులను వదిలిపెట్టం' | sidda raghavarao fires on trs | Sakshi
Sakshi News home page

' ఇదంతా ఓర్వలేకే.. బాధ్యులను వదిలిపెట్టం'

Jun 8 2015 12:33 PM | Updated on Aug 17 2018 12:56 PM

' ఇదంతా ఓర్వలేకే.. బాధ్యులను వదిలిపెట్టం' - Sakshi

' ఇదంతా ఓర్వలేకే.. బాధ్యులను వదిలిపెట్టం'

నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులు బహిర్గతం కావడంతో టీఆర్ఎస్ పార్టీ పై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు.

ప్రకాశం: నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో  ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులు బహిర్గతం కావడంతో టీఆర్ఎస్ పార్టీ పై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. టెలిగ్రాఫ్ చట్ట ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేయకూడదనే నిబంధన ఉన్నా.. టీఆర్ఎస్ నీచానికి పాల్పడుతుందని మంత్రి శిద్ధా రాఘవరావు విమర్శించారు.

 

అసలు ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబు వాయిస్ కాదని ఆయన స్పష్టం చేశారు.  తెలంగాణలో టీడీపీ ఎదుగుతుంటే ఓర్వలేక ఇదంతా చేస్తున్నారన్నారన్నారు. దీన్ని బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని శిద్ధా రాఘవరావు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement