టీడీపీ నేతలకు చుక్కెదురు | Shock to TDP Leaders In Kakinada | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలకు చుక్కెదురు

May 16 2020 4:46 AM | Updated on May 16 2020 4:46 AM

Shock to TDP Leaders In Kakinada - Sakshi

టీడీపీ నేతలను వెనక్కు వెళ్లిపోవాలని చెప్తున్న పోలీసులు

కాకినాడ: పేదలకు పంచేందుకు సిద్ధం చేసిన భూములను మడ అడవులుగా చూపే ప్రయత్నంలో ఏర్పాటైన టీడీపీ నిజ నిర్థారణ కమిటీకి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని దుమ్ములపేటలో చుక్కెదురైంది. ప్రభుత్వం సేకరించిన భూమి వద్దకు శుక్రవారం వచ్చిన టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణ, జవహర్‌లతో కూడిన కమిటీతో పాటు స్థానిక టీడీపీ నేతలను లబ్ధిదారులు నిలువరించారు.
కాకినాడ దుమ్ములపేట స్థలం వద్దకు చేరుకున్న టీడీపీ నేతలను నిరసిస్తున్న లబ్ధిదారులు  

టీడీపీ హయాంలోనే ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని, వేరొక కంపెనీకి 75 ఎకరాల స్థలాన్ని కేటాయించగా లేని అభ్యంతరాలు ఇప్పుడేమిటని నిలదీయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన పోలీసులు కమిటీకి నచ్చచెప్పి పంపేయడంతో లబ్ధిదారులు కూడా వెళ్లిపోయారు. దీంతో వివాదం సద్దుమణిగి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement