పాముకాటుకు గొర్రెలకాపరి మృతి | shepherd dies of snake bite | Sakshi
Sakshi News home page

పాముకాటుకు గొర్రెలకాపరి మృతి

Sep 21 2015 7:39 PM | Updated on Aug 20 2018 7:28 PM

గొర్రెలను మేపడానికి వెళ్లిన వ్యక్తి పాముకాటుకు గురై మృతిచెందాడు.

శింగనమల : గొర్రెలను మేపడానికి వెళ్లిన వ్యక్తి పాముకాటుకు గురై మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని సోదనపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  గ్రామానికి చెందిన కేశమయ్య(50) గత రెండు సంవత్సరాల నుంచి గొర్రెలను మేపుకుంటూ జీవిస్తున్నారు. సోమవారం రుశ్యశృంగుని కొండపై గొర్రెలను మేపుతుండగా.. పాము కాటు వేసి అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement