గుట్టల్లో గొర్రెల కాపరి మృత్యువాత | Shepherd accidental death | Sakshi
Sakshi News home page

గుట్టల్లో గొర్రెల కాపరి మృత్యువాత

Sep 15 2015 4:35 PM | Updated on Apr 3 2019 7:53 PM

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సోమిదేవపల్లి సమీపంలోని కొండల పైనుంచి కిందపడి ఒక గొర్రెల కాపరి మృతి చెందాడు.

రాచర్ల (ప్రకాశం) : ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సోమిదేవపల్లి సమీపంలోని కొండల పైనుంచి కిందపడి ఒక గొర్రెల కాపరి మృతి చెందాడు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బత్తుల రాజయ్య(65) ఐదు రోజుల క్రితం గొర్రెలను మేపుకునేందుకు గ్రామ సమీపంలోని గుట్టల్లోకి వెళ్లాడు.

అయితే ప్రమాదవశాత్తు గుట్టపై నుంచి కింద పడి మృత్యువు పాలయ్యాడు. కాగా మిగతా గొర్రెల కాపరులతో వెళ్లి ఉంటాడని కుటుంబసభ్యులు, ఇంటికి వెళ్లి ఉంటాడని కాపరులు అనుకుంటున్నారు. మంగళవారం అటుగా వెళ్లిన వారికి తీవ్ర దుర్వాసన రావటంతో చూడగా విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement