‘జనం చెక్కిన శిల్పం వైఎస్’ | Sharmila Released book on YS Rajashekara Reddy | Sakshi
Sakshi News home page

‘జనం చెక్కిన శిల్పం వైఎస్’

Aug 5 2013 3:38 AM | Updated on Jul 7 2018 2:52 PM

‘జనం చెక్కిన శిల్పం వైఎస్’ - Sakshi

‘జనం చెక్కిన శిల్పం వైఎస్’

‘కదలిక’ సంపాదకుడు ఇమామ్ రచించిన ‘జనం చెక్కిన శిల్పం వైఎస్’ పుస్తకాన్ని షర్మిల ఆదివారం పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆవిష్కరించారు.

ఇచ్ఛాపురం, న్యూస్‌లైన్: ‘కదలిక’ సంపాదకుడు ఇమామ్ రచించిన ‘జనం చెక్కిన శిల్పం వైఎస్’ పుస్తకాన్ని షర్మిల ఆదివారం పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆవిష్కరించారు. డాక్టర్ వైఎస్సార్ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని విడుదల చేసి ఫోరం ప్రతినిధులకు, రచయిత ఇమామ్‌కు అందించారు. ఇమామ్‌ను అభినందించారు. అక్కడికక్కడే సుమారు 300 కాపీలు పంపిణీ చేశారు. మార్చి నెలలో ఈ పుస్తకాన్ని మొదటిసారి ప్రచురించామని, 60 పేజీలు అదనంగా చేర్చి రెండోసారి ప్రచురించామని ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు శాంతమూర్తి, సువర్ణరాజు తెలిపారు.
 
 అది సానుభూతి కాదు.. వైఎస్‌పై ప్రేమ
 ‘‘షర్మిలను చూడ్డానికి, కరచాలనం చేయడానికి, ఆమె మాటలు వినడానికి, కష్టాలు చెప్పుకోడానికి లక్షలాది మంది పాదయాత్రకు తరలివచ్చారు. రాజకీయ నాయకులు అంటున్నారు ఇది సానుభూతి గాలి అని.. అది సానుభూతి కాదు, వాళ్లలో నాకు కనిపించింది కృతజ్ఞత. ఆ మహానాయకుడి కుటుంబం మీద ఉన్న ప్రేమ, అభిమానం. ఆరోజు వైఎస్సార్ పాదయాత్ర చేసి వాళ్ల కష్టాల కన్నీళ్లు తుడిచారు.. ఆ అభిమానంతోనే ఈ రోజు ప్రజలు షర్మిల వస్తున్నారని తెలుసుకొని పరుగుపరున వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఈ పాదయాత్రలో పాల్గొనటం నిజంగా నా అదృష్టం.’’
     - కాపు భారతి, రాయదుర్గం, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement