ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం | sexual harrasment on five years girl | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

Apr 20 2015 8:41 AM | Updated on Apr 4 2019 5:20 PM

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో దారుణం చోటు చేసుకుంది.

అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో దారుణం చోటు చేసుకుంది. మామిడి కాయ ఇస్తానని చెప్పి ఓ ఐదేళ్ల చిన్నారిపై పదోతరగతి విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వెంకటాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో వెలుగు చూసింది. వివరాలు..గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పదోతరగతి విద్యార్థి తన పక్కింటిలో ఉండే బాలికకు మామిడి కాయ ఇస్తానని చెప్పి ఆదివారం సాయంత్రం తీసుకెళ్లాడు.

అనంతరం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్త స్రావం కావడంతో బాలికను తల్లిదండ్రులు నిలదీయగా విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలిసిన బాలుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ప్రస్తుతం బాలికకు అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement