రేపు కడప దిగ్బంధనం | seemandhra protest in kadapa struck tomorrow | Sakshi
Sakshi News home page

రేపు కడప దిగ్బంధనం

Aug 4 2013 7:09 PM | Updated on Sep 1 2017 9:38 PM

సమైక్యాంధ్రా నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి.

వైఎస్‌ఆర్ జిల్లా: సమైక్యాంధ్రా నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఇప్పటికే సీమాంధ్ర జిల్లాలోని పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోగా,  కడప పట్టణాన్ని సోమవారం దిగ్బంధిస్తున్నట్లు సీమాంధ్ర ఆందోళన కారులు హెచ్చరించారు. రోడ్డుపైనే వంటా వార్పూ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వారు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజక కేంద్రాల్లోనూ ఆందోళనలు దిగనున్నారు.

 

వైఎస్ఆర్ జిల్లాలో కూడా నిరసనల హోరు ఉధృతమైంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనంతపురంలో ఎస్కే యూనివర్శిటీలోని అధ్యాపక బృందం తమ కుటుంబసభ్యులతో ఆదివారం యూనివర్శిటీ ఎదుట ఆందోళన చేయనుంది. అలాగే సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ డిపోల్లో నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement