సమైక్యాంధ్ర ఉద్యమంపై నేడు సమావేశం | Samaikyandhra movement today Meeting | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్ర ఉద్యమంపై నేడు సమావేశం

Nov 17 2013 3:58 AM | Updated on Sep 2 2018 4:46 PM

సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఉదయం 10 గం

 శ్రీకాకుళం అర్బన్, న్యూ స్ లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఉదయం 10 గం టలకు సమావేశం నిర్వహించనున్నామని ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ వెంకటరమణారావు శనివారం తెలిపారు. సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా జిల్లాల్లో పర్యటిస్తున్న వేదిక కన్వీనర్ ల క్ష్మారెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారని వెల్లడించారు. 
 
 సమైక్యాం ధ్ర ఉద్యమాన్ని మరింతగా ప్రజల్లో తీసుకువెళ్లనున్నామని పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఆచార్యులు ప్రసాదరెడ్డి, అంబేద్కర్ యూనివర్సిటీ ఆచార్యులు జి.తులసీరావు, రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు, ఏపీఎన్జీవో సంఘం సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు, జిల్లా చైర్మన్ హనుమంతు సాయిరాం, ప్రతినిధులు జామి భీమశంకర్, గీతాశ్రీకాంత్, దుప్పల వెంకట్రావు, ఎస్.వి.ఎస్.ప్రకాష్, కిలారి నారాయణరావు, కాళీ ప్రసాద్, జయరాం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర తది తరులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement