చంద్ర‌బాబు హయాంలో ఇచ్చిందెంత?

Sajjala Ramakrishnareddy Fire On CBN Remarks On Pharma Accident - Sakshi

ఏపీ ప్రభుత్వ సలహాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి 

సాక్షి, అమ‌రావ‌తి :  విశాఖ ప‌ర‌వాడ ఫార్మాసిటీ కంపెనీలో జ‌రిగిన ప్ర‌మాదంపై  చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్యల‌ను రాష్ర్ట ప్రభుత్వ స‌ల‌హాదారు సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తిప్పికొట్టారు. గ్యాస్‌లీక్‌ లాంటి అత్యంత అరుదైన ఘటనల్లో ప్రభుత్వం బాధ్యత తీసుకుని పెద్ద మొత్తంలో పరిహారం ఇస్తే, దాన్ని పరిహాసం చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 'విశాఖలో రెండు రోజుల కిందటి ఫ్యాక్టరీ ప్రమాదంలో బాధితులకు కోటి రూపాయ‌లు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. 13 నెలల కిందటి వరకూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. నగరంలో గ్యాస్‌పేలుడు సహా అనేక పారిశ్రామిక ప్రమాదాలు ఆయన హయాంలో జరిగాయి. అప్పుడు బాధితులకు ఇచ్చింది ఎంత? పైగా ప్రమాదాలు సహజమేనంటూ చంద్రబాబు కామెంట్‌ చేయలేదా? అలాంటి ఆయన ఇలాంటి డిమాండ్లు చేయడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు' అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. (చంద్రబాబు దళిత ద్రోహి: మేరుగ )

విశాఖ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్‌ ఫాక్టరీ నిర్వ‌హణ లోపంతోనే అగ్ని ప్ర‌మాదం జ‌రిగింద‌ని నిపుణుల క‌మిటీ ప్రాథ‌మికంగా నిర్థారించింది. రియాక్ట‌ర్‌లో ప‌రిమితికి మించి వాక్యూమ్ పెర‌గ‌డం, ర‌సాయ‌న మిశ్ర‌మాల్లో ఉష్ణోగ్ర‌త పెర‌గ‌డంతో ప్ర‌మాదానికి దారితీసింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఓ కార్మికుడు మృతిచెంద‌డంతో పాటు మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌పడ్డారు. ప్ర‌మాదంలో మృతిచెందిన శ్రీనివాస్‌రావు కుటుంబానికి కంపెనీ యజమాన్యం తరఫున రూ. 35 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 15 లక్షలు..  గాయపడిన వ్య‌క్తికి రూ. 20 లక్షల పరిహారాన్ని ప్ర‌భుత్వం ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. (విశాఖ ప్రమాదంపై నివేదిక అందజేత)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top