నేడు కండ్రిగ గ్రామానికి సచిన్ రాక | Sachin Tendulkar to be arrived puttamraju vari kandriga village at Nellore district | Sakshi
Sakshi News home page

నేడు కండ్రిగ గ్రామానికి సచిన్ రాక

Nov 16 2014 7:05 AM | Updated on Sep 2 2017 4:35 PM

నేడు కండ్రిగ గ్రామానికి సచిన్ రాక

నేడు కండ్రిగ గ్రామానికి సచిన్ రాక

ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, రాజ్యసభ సభ్యుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆదివారం నెల్లూరు జిల్లాలోని పుట్టరాజువారి కండ్రిగ గ్రామాన్ని సందర్శించనున్నారు.

నెల్లూరు: ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, రాజ్యసభ సభ్యుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆదివారం నెల్లూరు జిల్లాలోని పుట్టరాజువారి కండ్రిగ గ్రామాన్ని సందర్శించనున్నారు.  సంసాద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద సచిన్‌టెండూల్కర్ పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సచిన్ ఆదివారం గ్రామంలో పర్యటించనున్నారు. అందుకు సచిన్ శనివారం సాయంత్రం కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు. ఆ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సచిన్ పాల్గొననున్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రజలతో సచిన్ ప్రతిజ్ఞ చేయించనున్నట్టు సమాచారం.

కాగా, ఆయన రాక కోసం.. క్రీడాభిమానులు, గ్రామస్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సచిన్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ మేరకు జిల్లా అధికారులు పుట్టంరాజువారి కండ్రిగలో తిష్టవేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా  గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నారు

Advertisement
 
Advertisement
Advertisement