అమరావతిలో 65 కిలోమీటర్ల మేర సబ్ ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణం, వరద నియంత్రణ పనులు, నేలపాడు గ్రామంలో మౌలిక వసతుల స్థాయి పెంపునకు
ప్రాజెక్టు లక్ష్యాలకు ప్రపంచ బ్యాంకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: అమరావతిలో 65 కిలోమీటర్ల మేర సబ్ ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణం, వరద నియంత్రణ పనులు, నేలపాడు గ్రామంలో మౌలిక వసతుల స్థాయి పెంపునకు ప్రపంచబ్యాంకు రూ. 3,324 కోట్ల రుణం మంజూరు చేయనుంది. ఈ మేరకు ప్రాజెక్టు లక్ష్యాలకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది.
మరో రూ. 1,425 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా సమకూర్చుకొని మొత్తం రూ. 4,749 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపట్టనుంది. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రపంచ బ్యాంకు నిధులను మంజూరు చేయనుంది. ప్రాజెక్టు కాలవ్యవధిని 2019గా నిర్ధారించారు.