విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు మండలం గదపువలసలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.
విజయనగరం: విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు మండలం గదపువలసలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 15 పూరిళ్లు దగ్థమైయ్యాయి. అంతేకాక 10 లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.