భార్యపై రోకలితో దాడి..పరిస్థితి విషమం | rokalitho attack situation serious | Sakshi
Sakshi News home page

భార్యపై రోకలితో దాడి..పరిస్థితి విషమం

Mar 5 2017 3:31 PM | Updated on Aug 24 2018 2:36 PM

ఆదివారం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్‌రావు రోకలిబండతో భార్య తలపై బలంగా మోదాడు.

 
ఈపూరు(గుంటూరు జిల్లా): ఈపూరు మండలకేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీనివాసరావు, గుడికందుల కుమారి భార్యాభర్తలు, వీరికి ఇద్దరు పిల్లలు. ఆదివారం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్‌రావు రోకలిబండతో భార్య తలపై బలంగా మోదాడు.
 
భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో  గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement