రైతు ఇంట్లో చోరీ, నగదు అపహరణ | robbery in farmer sadhu home in kurnool district | Sakshi
Sakshi News home page

రైతు ఇంట్లో చోరీ, నగదు అపహరణ

Aug 6 2015 4:39 PM | Updated on Oct 1 2018 4:45 PM

కర్నూలు జిల్లా పైడాల మండలం కేంద్రంలో ఓ రైతు ఇంట్లో చోరీ జరిగింది.

పైడాల(కర్నూలు జిల్లా): కర్నూలు జిల్లా పైడాల మండలం కేంద్రంలో ఓ రైతు ఇంట్లో చోరీ జరిగింది. మండల కేంద్రంలోని సాధు అనే రైతు ఇంట్లో గుర్తుతెలియని దుండుగులు గురువారం చోరబడ్డారు. వారు రైతు ఇంట్లో నుంచి రూ. 10 వేల నగదు, 3 బియ్యం బస్తాలను ఎత్తుకెళ్లారని రైతు తెలిపాడు. చోరీ ఘటనపై రైతు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement