లారీ బస్సు ఢీ.. ఇద్దరు మృతి | Road Accident: Lorry Hits private Bus in tadepally gudem mandal | Sakshi
Sakshi News home page

లారీ బస్సు ఢీ.. ఇద్దరు మృతి

May 7 2015 8:37 AM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న లారీ రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల డ్రైవర్లు మరణించారు.

తూర్పుగోదావరి: వేగంగా వెళ్తున్న లారీ రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల డ్రైవర్లు మరణించారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి కాకినాడ పోర్టుకు గ్రానేట్‌లోడ్‌తో వెళ్తున్న లారీ కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సును ఢీకొట్టింది. దీంతో ట్రావెల్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా..లారీ డ్రైవర్కు  తీవ్ర గాయాలతో ఆస్సత్రి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement