breaking news
Lorry Hits
-
నంద్యాల: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆళ్లగడ్డ మండలం పేరాయపాలెం మెట్ట వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 సమయంలో ప్రమాదం జరిగింది. మృతులను బద్రీనాథ్, హరితగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి వెళ్తుండగా ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ సునీల్ షేరాన్ సహాయక చర్యలు చేపట్టారు. -
రెండు లారీలు ఢీ,ఇద్దరు డ్రైవర్లు మృతి
-
సంగారెడ్డిలో లారీ బీభత్సం : కానిస్టేబుల్ మృతి
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. స్థానిక చౌరస్తాలో గురువారం సాయంత్రం లారీ బీభత్సం సృష్టించింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ కదిర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కదిర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
లారీ బస్సు ఢీ.. ఇద్దరు మృతి
తూర్పుగోదావరి: వేగంగా వెళ్తున్న లారీ రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల డ్రైవర్లు మరణించారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి కాకినాడ పోర్టుకు గ్రానేట్లోడ్తో వెళ్తున్న లారీ కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సును ఢీకొట్టింది. దీంతో ట్రావెల్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా..లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలతో ఆస్సత్రి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.


