సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆళ్లగడ్డ మండలం పేరాయపాలెం మెట్ట వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 సమయంలో ప్రమాదం జరిగింది. మృతులను బద్రీనాథ్, హరితగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి వెళ్తుండగా ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ సునీల్ షేరాన్ సహాయక చర్యలు చేపట్టారు.


