ఆర్టీసీ బస్సు ఢీకొని జీపు బోల్తా | Road accident in Atluru | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని జీపు బోల్తా

Sep 8 2015 5:38 PM | Updated on Apr 3 2019 7:53 PM

వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం రెడ్డిపల్లి సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఎదురుగా వస్తున్న జీపు పక్కనున్న గోతిలోకి బోల్తాపడింది.

అట్లూరు (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం రెడ్డిపల్లి సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఎదురుగా వస్తున్న జీపు పక్కనున్న గోతిలోకి బోల్తాపడింది. కడప నుంచి బద్వేలుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా అరటికాయల లోడుతో వస్తున్న జీపును వేగంగా ఢీకొంది. దాంతో జీపు పైకి ఎగిరి పక్కనున్న గోతిలో బోల్తాపడింది. ఈ సంఘటనలో జీపులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement