రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | red sander caught in railway koduru | Sakshi
Sakshi News home page

రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Dec 9 2015 5:55 PM | Updated on Sep 3 2017 1:44 PM

వైఎస్ఆర్ కడప రైల్వే కోడూరు మండలం సూరపురాజు పల్లి క్రాస్ రోడ్డు వద్ద 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

రైల్వేకోడూరు: వైఎస్ఆర్ కడప  రైల్వే కోడూరు మండలం సూరపురాజు పల్లి క్రాస్ రోడ్డు వద్ద 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అబ్బిరాజుగారిపల్లె గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఇన్నోవా కారులో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 15 లక్షలు ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. ఇన్నోవాను సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement