అరవ శ్రీధర్‌ సిఫారసుతోనే అబార్షన్‌ | My abortion was done on the recommendation of alliance MLA Arava Sridhar | Sakshi
Sakshi News home page

అరవ శ్రీధర్‌ సిఫారసుతోనే అబార్షన్‌

Feb 1 2026 5:11 AM | Updated on Feb 1 2026 5:11 AM

My abortion was done on the recommendation of alliance MLA Arava Sridhar

తొలిసారి బాధితురాలి స్నేహితుడితో మాత్రలు పంపిన ఎమ్మెల్యే 

అబార్షన్‌ చేసిన రైల్వే కోడూరులోని సంజీవిని హాస్పిటల్‌ వైద్యులు? 

కూటమి ఎమ్మెల్యే పైశాచికత్వం 

పుల్లంపేట: కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ సిఫారసుతోనే తన అబార్షన్‌కు  ఆసుపత్రి వైద్యులు సహకరించారని అరవ శ్రీధర్‌ బాధితురాలు శనివారం మరో వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే చొరవ­తో రైల్వే కోడూరులోని సంజీవిని హాస్పిటల్‌ వైద్యు­లు తనకు స్కానింగ్‌ చేసి అబార్షన్‌కు మాత్రలు ఇవ్వడంతో గర్భం పోగొట్టుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. గతేడాది సెపె్టంబరు 5న కారులో సంజీవిని ఆసుపత్రికి తీసుకెళ్లి, అప్పటికే మాట్లాడిన వైద్యులతో పరీక్షలు చేయించి, అబార్షన్‌కు మాత్రలు ఇ­ప్పించినట్లు బాధితురాలు చెప్పారు. 

తొలిసారి శ్రీధర్‌ స్నేహితుని ద్వారా ఇలాంటి మాత్ర­లు తెప్పించి అబార్షన్‌ చేయించారని వివరించారు. ఓ ప్రజాప్రతినిధి ఇలా మెడికల్‌ కౌన్సిల్‌ నియమాలను ఉల్లంఘించి, స్త్రీల పట్ల ఇంత పైశాచికంగా ప్రవర్తించడంపై పలువురు తప్పు పడుతున్నారు. అరవ శ్రీధర్‌ను చట్టబద్ధ పదవి నుంచి తొలగించాల్సిన అవసరముందన్నారు. ఎమ్మెల్యే చెప్పాడని అబార్షన్‌ టాబ్లెట్స్‌ ఇచ్చి సహకరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మందులను వైద్యులు సిఫారసు చేయ­డం గానీ, మెడికల్‌ షాపు­ల్లో విక్రయంచడం గాని చేయకూడదు. డ్రగ్‌ కౌన్సిల్‌ ఈ విషయంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతు­న్నారు. కాగా, సంజీవిని ఆసుపత్రి వైద్యుడు ఇటీవల మాట్లాడుతూ.. తమ ఆసుపత్రిలో ఎలాంటి అబార్షన్‌ చేయలేదని, స్కానింగ్‌ చేసి, మెడికల్‌ ప్రి్రస్కిప్షన్‌ రాసిచ్చామని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement