15 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ | Red sandalwood smugglers arrested in Chittoor district | Sakshi
Sakshi News home page

15 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Oct 30 2014 10:45 AM | Updated on Aug 20 2018 4:44 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఏర్పేడు వద్ద గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఏర్పేడు వద్ద గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా పెద్ద ఎత్తున తరలిస్తున్న ఎర్రచందనాన్ని తిరుపతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి 15 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వాహనాలను సీజ్ చేశారు. స్మగ్లర్లను పోలీసులు తిరుపతి తరలించారు. స్మగ్లర్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టబడిన ఎర్రచందనం విలువ రూ. 40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement