చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ | Red sandalwood smugglers arrested in chittoor | Sakshi
Sakshi News home page

చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Apr 8 2015 11:36 AM | Updated on Aug 20 2018 4:44 PM

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ జరిగి 24 గంటలు గడిచిందో లేదో... 14 మంది ఎర్రచందనం స్మగ్లర్లను బుధవారం పోలీసులు చిత్తూరులో అరెస్ట్ చేశారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ జరిగి 24 గంటలు గడిచిందో లేదో... 14 మంది ఎర్రచందనం స్మగ్లర్లను బుధవారం పోలీసులు చిత్తూరులో అరెస్ట్ చేశారు. అక్రమంగా భారీ ఎత్తున తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. స్మగ్లర్లను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.

పట్టుబడిన ఎర్రచందన విలువ రూ. కోటిన్నర ఉంటుందని పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో మంగళవారం పోలీసులకు.. ఎర్రచందనం స్మగ్లర్లు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement