నలుగురు 'ఎర్ర' స్మగ్లర్ల అరెస్ట్ | Red sandalwood smugglers arrested | Sakshi
Sakshi News home page

నలుగురు 'ఎర్ర' స్మగ్లర్ల అరెస్ట్

Dec 7 2015 7:47 PM | Updated on Aug 20 2018 4:27 PM

చిత్తూరు పోలీసులు సోమవారం నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకొన్నారు. చిత్తూరు పోలీసులు సోమవారం మధ్యాహ్నం మురకంబట్టు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు.

చిత్తూరు అర్బన్ : చిత్తూరు పోలీసులు సోమవారం నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకొన్నారు. చిత్తూరు పోలీసులు సోమవారం మధ్యాహ్నం మురకంబట్టు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఓ కారును తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలు కనిపించాయి.

వాటిని స్వాధీనం చేసుకుని కారులో ఉన్న పూతలపట్టు మండలం నచ్చుపల్లెకు చెందిన రోహిణీకుమార్(36), గంగాధరనెల్లూరుకు చెందిన ఎస్.సుధాకర్(36), చిత్తూరు లాలూగార్డెన్‌కు చెందిన షేక్ అబ్దుల్ రఫీ(41), తమిళనాడు గుడియాత్తంకు చెందిన జి.మునిరత్నం(34)ను అరెస్టు చేశారు.  వారిని నుంచి కారు, ఒక రివాల్వర్, నాలుగు రౌండ్ల బుల్లెట్లు, రూ.25 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, రూ.9 వేలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement