వితంతువుపై అత్యాచారం | rape of Widow | Sakshi
Sakshi News home page

వితంతువుపై అత్యాచారం

Oct 29 2015 12:48 AM | Updated on Jul 28 2018 8:53 PM

మండలంలోని కంచుగుమ్మలలో వితంతువుపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై బుధవారం కేసు

రోలుగుంట: మండలంలోని కంచుగుమ్మలలో వితంతువుపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై బుధవారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మూడేళ్ల క్రితం భర్త చనిపోయి ఓ మహిళ ఒంటరిగా ఉంటోంది. గ్రామానికి చెందిన పరవాడ నూకరాజుదొర ఆమెను చాలా కాలంగా వేధిస్తున్నాడు.

మంగళవారం ఆమెతో మాట్లాడుతున్నట్టు నటించి ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ఈడ్చుకుపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు బధువారం రోలుగుంట వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐలు గోవిందరావు, శిరీష్ కుమార్ బందోబస్తుకు వెళ్లడంతో కొత్తకోట సీఐ హెచ్ మల్లేశ్వరరావుకు ఫిర్యాదు చేసింది. సీఐ ఆదేశాలమేరకు రోలుగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement