తుఫాన్’ను అడ్డుకుంటాం | Ramcaran Teja toofan movie in stop telangana | Sakshi
Sakshi News home page

తుఫాన్’ను అడ్డుకుంటాం

Sep 5 2013 4:29 AM | Updated on Aug 9 2018 7:28 PM

కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ నటించిన తుఫాన్ సినిమాను అడ్డుకుని తీరుతామని విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.

 ఖలీల్‌వాడి, న్యూస్‌లైన్ : కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ నటించిన తుఫాన్ సినిమాను అడ్డుకుని తీరుతామని విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ వద్ద తుఫాన్ సినిమా పోస్టర్లను తగలబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సామాజిక తెలంగాణ అంటూ ప్రజల వద్దకు వచ్చిన చిరంజీవి తర్వాత మాటమార్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ద్రోహిగా మారిన చిరంజీవి కుటుంబ సభ్యులు నటించే సినిమాలను అడ్డుకుంటామన్నారు. తుఫాన్ సినిమా తెలంగాణలో విడుదల కాకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ జిల్లా అధికార ప్రతినిధి ప్రగతి, నాయకులు మర్రికిరణ్, సాయి, శ్రావణ్‌తివారి, లక్ష్మణ్, ప్రశాంత్, సుమన్, రాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement