'అది నూటికి నూరుశాతం చంద్రబాబు గొంతే' | ramachandraiah takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

'అది నూటికి నూరుశాతం చంద్రబాబు గొంతే'

Jun 8 2015 10:53 AM | Updated on Aug 17 2018 12:56 PM

'అది నూటికి నూరుశాతం చంద్రబాబు గొంతే' - Sakshi

'అది నూటికి నూరుశాతం చంద్రబాబు గొంతే'

ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు.

కడప: ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు.  చంద్రబాబు వెంటనే తన ముఖ్యమంత్రిపదవికి రాజీనామా చేసి ఏసీబీ విచారణకు సిద్ధపడాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు అనేదానికన్నా అందులో చంద్రబాబు మాట్లాడిన మాటాలకు ప్రాధాన్యముందన్నారు.

 

నూటికి నూరు శాతం ఆ ఫోన్ లో మాట్లాడిన గొంతు చంద్రబాబుదేనన్నారు. ఒకవేళ కాకపోతే ఫోరెనిక్స్ ల్యాబ్ లో టెస్ట్ చేయించుకోవచ్చని రామచంద్రయ్య పేర్కొన్నారు.  'చంద్రబాబు మాట్లాడేతీరు, యాస, భాష నాకు పూర్తిగా తెలుసు.  ఈ వాయిస్ నాది కాదంటూ ఇప్పుడు వివాదం చేస్తున్నారు. ల్యాబ్ కు పంపిస్తే నిజాలు బయటకు వస్తాయి. ముడుపులు వ్యవహారంలో చంద్రబాబు చేసింది పూర్తిగా వ్యక్తిగతం. కాని దీన్ని రాష్ట్రాల మధ్య యుద్ధంగా చూపిస్తున్నారు. ఇది అరాచకం. పరకాల ప్రభాకర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీన్ని రాష్ట్రాల మధ్య యుద్ధంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇరు రాష్ట్రాల ప్రజలు చాలా బాగున్నారు. ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా కిరాతకం'అని సాక్షికి ఇచ్చిన ఇంటర్యూలో రామచంద్రయ్య పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement