చంద్రబాబును కలసిన రామ్ చరణ్ | ram charan meets chandra babu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును కలసిన రామ్ చరణ్

Oct 24 2014 5:23 PM | Updated on Jul 28 2018 6:35 PM

చంద్రబాబును కలసిన రామ్ చరణ్ - Sakshi

చంద్రబాబును కలసిన రామ్ చరణ్

ప్రముఖ హీరో రామ్ చరణ్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.

హైదరాబాద్: ప్రముఖ హీరో రామ్ చరణ్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. హుదూద్ తుపాన్ బాధితుల సహాయార్థం రామ్ చరణ్ 15 లక్షల రూపాయల విరాళాన్ని చంద్రబాబుకు అందజేశారు.

ఇటీవల సంభవించిన హుదూద్ తుపాన్ వల్ల ఉత్తరాంధ్రలో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. తన వంతు సాయంగా 15 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన రామ్ చరణ్ చంద్రబాబుకు చెక్ను అందజేశారు. ఓ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో టీమ్ కూడా చంద్రబాబును కలసి 4.4 లక్షల విరాళం అందజేసింది. పలువురు సినీ రంగ ప్రముఖులు తుపాన్ బాధితులకు విరాళాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement